23 ఏళ్లకే వార్డు సభ్యుడుగా ఎన్నిక
నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలోని మల్లారం గ్రామంలో నెల 11న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యునిగా గ్రామానికి చెందిన దాసరి సంజయ్ కుమార్ గెలుపొందారు. గ్రామంలో సర్పంచ్, నాలుగు వార్డు సభ్యులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా మిగిలిన నాలుగు వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు వార్డులు బిఆర్ఎస్ మద్దతు దారులు గెలుచుకోగా.. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దాసరి సంజయ్ కుమార్ ప్రత్యర్థి పై 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక వార్డు మెంబర్ గానిలిచాడు. 23 ఏళ్ల సంజయ్ మండలంలోని అత్యంత పిన్న వయస్కుడైన వార్డ్ సభ్యుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, గ్రామ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
మల్లారం వార్డు సభ్యునిగా దాసరి సంజయ్ కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



