Sunday, December 21, 2025
E-PAPER
Homeజిల్లాలుకట్టంగూరు సర్పంచ్ ను అభినందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కట్టంగూరు సర్పంచ్ ను అభినందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూరు
పంచాయతీ ఎన్నికల్లో కట్టంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన ముక్కామల శ్యామల శేఖర్ ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు అభినందించారు. శనివారం నల్లగొండలో వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు శ్యామల శేఖర్ కు శుభాకాంక్షలు తెలిపి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వారితోపాటు వార్డు సభ్యులుగా గెలుపొందిన ఏనుగు సైదులు, పురకం శ్రీనులను  అభినందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నర్సింహ్మయాదవ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చెరుకు యాదగిరి, ఏకుల సైదులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -