భారతీయ సినిమా చరిత్ర తొలివాళ్లను పరిశీలించినపుడు హైదరాబాద్ స్టేట్ ప్రాంతమంతా కూడా బొంబాయి రీజియన్ పరిధిలో ఉండింది. పైగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్న సైనికాధికారులకు బొంబాయి, కలకత్తాలతో సంబంధాలు ఉండేవి. అందుకే, తొలి మూవీ కెమెరా కలకత్తా నుండి హైదరాబాద్ కు 1910లో వచ్చింది. హిందీ, ఉర్దూలకు ఉన్న భాషా సన్నిహితం వల్ల, బొంబాయి సినిమా రంగం హైదరాబాదును ఆకర్షించింది. ఫలితంగా మూకీల కాలంలోనే 1927లో హైదరాబాద్ పాత నగరంలోని నాగులచింతకు చెందిన రామ్ ప్యారి అనే నర్తకి బొంబాయి వెళ్ళి మూకీ చిత్రాల్లో నటించింది.
1931లో మాట్లాడే సినిమాలు వచ్చిన తర్వాత తొలి టాకీ చిత్రం ‘అలం ఆరా’ (1931) కథానాయిక జుబేదా బేగం మన హైదరాబాదీనే.
జుబేదా బేగం
ఈ జుబేదా బేగంకీ మన హైదరాబాదుకు ఏమిటి సంబంధం అనే అనుమానం కలుగవచ్చుఎవరికైనా .అది తెలుసుకునే ముందు ఈ క్రింది విషయాలు చదవాలి. జుబేదా బేగం బాంబే ప్రెసిడెన్సీలోని సూరత్ 1911లో జన్మించారు. తండ్రి సాచిన్ మూడవ నవాబు సిద్ధి ఖబ్రాహీం యాఖూత్ ఖాన్, తల్లి ఫాతిమాబేగం. ఈమె ఆ కాలంలోనే సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టినా, విద్యావంతురాలవడంతో ఆమె తన ముగ్గురు కుమార్తెలను నటనారంగంలో ప్రవేశపెట్టింది.వారి పెద్ద కుమార్తెనే మన జుబేదాబేగం. ఆమె మూగ చిత్రాల కాలంలోనే సినిమాల్లోకి ప్రవేశించింది. మూకీ చిత్రాలలో నటించడమే గాక తరువాత పలు మూకీలకు దర్శకత్వం వహించింది.
ఫాతిమా బేగం తన కుమార్తెలు సినిమాల్లో నటించడానికి ప్రోత్సహించింది. 1924లో ”గులేబకావళి” మూకీ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది జుబేదా బేగం. అతికొద్ది కాలంలోనే ఆమె సైలెంట్ స్టార్ గా ఎదిగింది. 1913- 1933 మధ్యకాలంలో 37 మూకీ సినిమాల్లో నటించిందామె. వాటిలో కాలనాగ్, మనోరమ, ప థ్వీవల్లబ్, కల్యాణ్ ఖజీనా (1924 3) దేవదాసి, దేశ్ కా దుష్మన్, రంభ ఆఫ్ రాజ నగర్, ది డివైన్ పనిష్మెంట్, ఇంధ్రసభ (1925), నటి మీనా దేవి, అబోలా రాణి, బుల్బులే ఫరిస్తా, కాశ్మీరా, మ్యాన్ అండ్ హిజ్ డెస్టినీ, మిస్సింగ్ బ్రాసిలైట్, సతీ మహాదేవి (1926), సాక్రిఫైజ్, లైలామజ్ను, ననంద భోజై (1927) హీర్ రాంజా, ఎంపరర్ అశోక్, గోల్డెన్ గ్యాంగ్ (1928), మిలన్ దినార్, యంగ్ ఇండియా, మహాసుందర్, వండ్రఫుల్ ప్రిన్స్ (1929) ఫౌలాద్ , నూర్ ఏ పంజాజ్, దేవదాసి, లవ్ ఏంజిల్, వీర్ రాజ్ పుత్ (1980) ఏ ఫర్ యాన్ ఐ, వేజెస్ ఆఫ్ సిన్, లాండ్ ఆఫ్ పిర మిడ్స్, అండర్ వరల్డ్, రొమాంటిక్ ప్రిన్స్ తదితర మూకీలు ఉన్నవి.
భారతదేశంలో 1931లో అర్దేషిర్ ఇరానీ తొలి భారతీయ రాకీ ”అలంఆరా తీయాలనుకున్నప్పుడు ‘అలాంఆరా’గా ప్రధానమైన పాత్రకోసం ఇరానీ జుబేదాను ఎంపిక చేశారు. అలా తొలిటాకీ నాయికగా జుబేదా భారతీయ సినిమా చరిత్ర కెక్కింది. తరువాత జుబేదా మేరీజాన్ , వీర్ అభిమన్యు (1931), జరీనా, బుల్ బులే పంజాబ్, (193 2), మహాభారత్, పాండవ్- కౌరవ్, ది అన్ టచబుల్, మహాభారత్ (1923), గుల్ సవోబర్, ననంద్ భోజై, నంద్ కే లాలా, సేవా సదన్, బీర్బల్ కే బేటి (1934), గు ల్షన్- ఏ – ఆలం (1935) మా (1936), ఔరత్ కి జిందగి, దేవదాస్, కిస్ కీ ప్యార్ (1931) వంటి టాకీలలో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం ”నిర్దోష్ అబల” (1940).

జుబేదాకి హైదరాబాద్ కున్న సంబంధమేటంటే ఆమె ఇక్కడి మహరాజ్ సర్సింగ్ ధన్ రాజ్గిర్ ని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెళ్ళి తరువాత కూడా ఆమె నటించడం కొనసాగించారు. 1934 లో నానూబారు వకీల్తో కలిసి ‘మహాలక్ష్మి సినీటోన్’ అనే సంస్థను నెలకొల్పి పలు సినిమాలు నిర్మం వారు. 1934, 1935 సంవత్సరాల్లో ఆమె నటించిన చిత్రాలన్ని మహాలక్ష్మి కంపెనీవే. 1930-40 దశకంలో వచ్చిన మూకీ, టాకీలలో హీరో జాల్ మెర్చంట్ తో కలిసి చాలా మటుకు పోరాణిక చిత్రాల్లో సుభద్ర, ఉత్తర, ద్రౌపది పాత్రలకు జుబేదా పెట్టింది పేరు, ప ధ్వీరాజ్ కపూర్, మాస్టర్ విఠల్ వంటి తొలితరం అగ్రశ్రేణి హీరోలతో గాయక నటిగా, న త్య తారగా జుబేదా ఒక వెలుగు వెలిగింది. ఆమె ఉర్దూలో అదుÄతేమైన సంభాషణలు పలకడంలో గొప్ప నేర్పును ప్రదర్శించేది. ఇంకా, చారిత్రక సాంప్రదాయ దుస్తుల్లో ఇమిడి పోవడంలో ఆమెను తప్ప మరొకరిని ఆ రోజుల్లో ఊహించేవారు కాదు. జుబేదా బొంబాయిలోని ధన్రాజ్ మహల్ ప్యాలెస్ లో తన చివరి రోజులను గడుపుతూ 1988 సెప్టెంబరు 20న మరణించింది.
రామ్ ప్యారి
ఇక రాంప్యారీ విషయానికి వద్దాం. హైదరాబాదులో అచ్చ తెలుగు కుటుంబానికి చెందిన కళాకారిణి రాంప్యారి. 1908 ఆగస్టు 27న జన్మించిన రాంప్యారిది సంగీత నాట్య రంగాలలో ప్రవేశం కలిగిన కళావంతుల కుటుంబం. వారి ముందు తరాల వారంతా తారామతి, ప్రేమామతికి చెందిన వారు. వీరిని గోలకొండ తానీషా అతిథులు వచ్చినప్పుడు తన ఆస్థానంలో జరిగే సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించేవారు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం నుండేగాక ఇతర రాజాస్థానాల నుండి కూడా వారికి సంగీత, నత్య కచేరీలు చేయడానికి ఆహ్వానాలు అందేవి. అయితే గోల్కొండ ప్రభువుల పాలన అంతమైన తర్వాత ఆ కుటుంబాలన్నీ చెల్లాచెదురైపోయినవి. అలా విడిపోయిన వారంతా మాదన్నపేట, హయత్ నగర్ వంటి ప్రాంతాలకు తరలివెళ్లగా, మరికొందరు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరిలో ఒక చిన్న కుటుంబాల సమూహం నేటి హైదరాబాద్ లోని పాతనగరంలో ఉన్న ‘నాగులచింత’ ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డారు.అప్పట్లో ఈ ప్రాంతమంతా చింతచెట్లతో నిండి ఉండి నాగుపాములకు నిలయమై ఉండటంతో ‘నాగుల చింత’ అనే పేరు వచ్చింది.
రామ్ ప్యారీ తెలుగు, ఉర్దూ, మరాఠి,ఉర్దూ, కన్నడ,ఇంగ్లీష్ భాషలు బాగా మాట్లాడగలిగేది. ఆమె పాడటంలోనే గాక నాట్యంలో కూడా శిక్షణ పొందింది. 1918లో పదేళ్ల వయసులో మద్రాసుకు వెళ్లిన రాం ప్యారి అక్కడ తన పెదతల్లి పెంపకంలో భరతనాట్యం నెచ్చుకుంది. నాలుగేళ్ల శిక్షణ తర్వాత మద్రాసులో పేరున్న నాట్యకారిణిగా వెలుగులోకి వచ్చింది. 1926లో మద్రాసులో ఒక నాట్య ప్రదర్శన ఇస్తుండగా కోహినూర్ ఫిలిం కంపెనీ (బొంబాయి)కి చెందిన ఒక నిర్మాత చూసి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బొంబాయికి ఆహ్వానించాడు.

మూకీల కాలంలో చందూలాల్ షా తీసిన ”గుణ సుందరి” (1927) లో తొలిసారిగా ఒక చిన్న పాత్ర చేసి సినిమా రంగానికి పరిచయమైన రాంప్యారి రెండో సినిమా ‘వైల్ విమెన్’ (1928)లో తన న త్య సన్నివేశాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. ఆమె మంచి నాట్యకారిణి కావడంతో ఆ తరువాతి నుండి నాయికగా అవకాశాలు వచ్చినవి. 1930ల నాటికి జనాదరణ ఉన్న హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె సిల్వర్ క్లౌడ్, నీలం మనేక్, కుంజ్ కిశోరి, హామ్లెట్, డ్రీమ్ లాండ్, డిటెక్టివ్ కుమార్(1925), రెవల్యూషన్, రాజ్ హింస, మిస్ డాలి, జై సోమ్ నాథ్, హతిం తాయి, ఫిమేల్ ఫేట్, డేరింగ్ రాథోడ్ (1929) యాస్మినా, ది వాయిలెంట్, డేర్ డెవిల్, ఇమ్మోర్టల్ గ్లోరి (1930), లయన్స్, డాషింగ్ యూత్ (1931) వంటి మొత్తం 22 మూకీ చిత్రాల్లో నటించింది రామ్ ప్యారి.
టాకీలు వచ్చిన 1931లోనే మూడు టాకీల్లో నటించిందామె. వరుసగా అవి పాక్ దామన్, లైలామజ్ను, ఘర్ కీ లక్ష్మి.ఆ తరువాత గుణసుందరి (1934), మీఠీ నజర్, జీవన్ నాటక్, ఆజాద్ అబల, అపరాధి (1935), బండేట్ ఆఫ్ ఎయిర్, సునెహర సన్సార్, జాన్బాజ్ మలీక్ (1936), మిలన్, సముందీశ్వరి (తమిళం), ఖుదాయి, ఖిద్మత్ దార్ (1937), ప్రేమ్ సాగర్ (1939), బారాత్ (1942), ఆశీర్వాద్ (1943), ఘజల్ (1945), గీత గోవింద్, కౌన్ పరదేశీ (1947), మంజూర్ (1949) వంటి చిత్రాల్లో రామ్ ప్యారీ నాయికగా, ఇతర ప్రధాన పాత్రధారిణిగా నటించింది. ప థ్వీరాజ్ కపూర్, మాధవ్ కాలే, జైరాజ్ వంటి హీరోలతో ఆమె కలిసి నటించారు. అంతేకాదు దేవకీబోస్ దర్శకత్వంలో ‘విద్యాపతి’ చిత్రంలో నటించింది. తాను అభిమానించే రూబీమేయర్ సులోచన, గౌహర్లతో ‘రంజిత్ మూవీస్ చిత్రాల్లోనూ నటించించామె.
మూకీల కాలంలో నటిస్తున్న రామ్ ప్యారీ ఆయా చిత్రాలు ప్రదర్శితమయ్యే థియేటర్లలో విరామ సమయంలో పరదాల ముందు నర్తించేదని తొలితరం దర్శకులు సి. ఎస్. రావు ప్రస్తావించారు. అలా దక్షిణ భారతమంతా ఆమె న త్య ప్రదర్శనలిచ్చింది. ఇంకా రామ్ ప్యారి శ్రీలంక వంటి పొరుగు దేశాల్లో కూడా పర్మటించి ప్రదర్శనలిచ్చింది. ‘సిలోన్ లేబర్ యూనియన్ ఆమెను బంగారు జ్ఞాపికతో సత్కరించింది. సినిమా రంగంలో విరివిగా అవకాశాలు రావడంతో 1930 నాటికి రామ్ ప్యారీ బొంబాయిలోనే స్థిరపడిపోయింది. దాంతో ఆమెకు హైదరాబాదులో సంబంధాలు దాదాపుగా తెగిపోయినవి. అయితే ఆ తరం హైదరాబాదు సినిమా అభిమానుల హదయాలకు మాత్రం దూరం కాలేదు. హైదరాబాదు నుండి వెళ్లిన అభిమానులతో దఖనీ ఉర్దూలో ఆప్యాయంగా పలకరించేది.
అయితే సినిమాలకు దూరమైనాక రామప్యారి తర్వాతి జీవిత విశేషాలేవీ తెలిసి రావడం లేదు. . పూనాకు చెందిన సినీ చరిత్రకారుడు సురేష్ సర్వయ్య అందించిన సమాచారం మేరకు 1970 ఆగస్టు 28న ఆమె కన్ను మూసింది. ఏది ఏమైనా బొంబాయి వెళ్లిన తొలి తెలంగాణ నటిగా హైదరాబాదీగా రామ్ ప్యారి తెలంగాణ సినిమా చరిత్రలో నిలిచిపోయింది.
వ్యాసకర్త తెలంగాణ సినీ చరిత్రకారుడు
– హెచ్ రమేష్ బాబు, 7780736386



