Sunday, December 21, 2025
E-PAPER
Homeసినిమాన్యూ ఇయర్‌ కానుకగా రిలీజ్‌

న్యూ ఇయర్‌ కానుకగా రిలీజ్‌

- Advertisement -

అవినాష్‌ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘వానర’. సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్‌ స్క్రీన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై అవినాష్‌ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మైథలాజికల్‌ రూరల్‌ డ్రామా కథతో తెరకెక్కిన ఈచిత్రం కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కి రెడీ అవుతోందని మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మేకర్స్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌ అందరిలోనూ మంచి బజ్‌ని క్రియేట్‌ చేసింది.

అలాగే టీజర్‌కు 2 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌ రాగా, రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ ‘అదరహో’ కూడా మ్యూజిక్‌ లవర్స్‌ని విశేషంగా అలరించింది. ఇక సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌, వివేక్‌ సాగర్‌ మ్యూజిక్‌ మా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అని తెలిపారు. అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్‌, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్‌చంద్ర, రచ్చరవి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ : నార్ని శ్రీనివాస్‌, ఎడిటింగ్‌ : ఛోటా కె.ప్రసాద్‌, డీఓపీ : సుజాత సిద్ధార్థ్‌, స్టోరీ, స్క్రీన్‌ప్లే : విశ్వజిత్‌, డైలాగ్స్‌: సాయిమాధవ్‌ బుర్రా, దర్శకత్వం : అనివాష్‌ తిరువీధుల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -