Sunday, December 21, 2025
E-PAPER
Homeసినిమా'మా వందే' మొదలైంది..

‘మా వందే’ మొదలైంది..

- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ను ‘మా వందే’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. సిల్వర్‌ కాస్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత వీర్‌ రెడ్డి.ఎం. నిర్మిస్తున్న దీనికి దర్శకుడు క్రాంతికుమార్‌ సి.హెచ్‌.
నరేంద్రమోదీ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో ఉన్ని ముకుందన్‌ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించనున్నారు. ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అలాగే రెగ్యులర్‌ షూటింగ్‌ని కూడా ఆరంభిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఎన్నో విశేషాలు ఈసినిమాలో చూడబోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా భాషలతోపాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్‌ చేయనున్నారు.
రవీనాటాండన్‌ నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్‌ : కింగ్‌సోలొమన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : సాబు సిరిల్‌, ఎడిటింగ్‌ : శ్రీకర ప్రసాద్‌, డీఓపీ : కె.కె.సెంథిల్‌ కుమార్‌, మ్యూజిక్‌ : రవి బస్రూర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -