- Advertisement -
భారత్, శ్రీలంక తొలి టీ20 నేడు
నవతెలంగాణ-విశాఖపట్నం : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ చాంపియన్ టీమ్ ఇండియా.. విశ్వవిజేతగా నిలిచిన తర్వాత తొలిసారి బరిలోకి దిగుతోంది. జనవరిలో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆరంభం కానుండగా.. శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హర్మన్‌సేన తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం వేదిక కానుండగా.. చివరి మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరుగుతాయి. భారత జట్టులో స్మృతీ మంధాన, జెమీమా రొడ్రిగ్స్, దీప్తి శర్మ కీలకం కానున్నారు. భారత్, శ్రీలంక మహిళల తొలి టీ20 నేడు రాత్రి 7 గంటలకు ఆరంభం.
- Advertisement -



