Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅధిక మొత్తంలో డబ్బు కోసమే 'పైరసీ' ఎంపిక

అధిక మొత్తంలో డబ్బు కోసమే ‘పైరసీ’ ఎంపిక

- Advertisement -

పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి
టెలీగ్రామ్‌ ఐడీలపై దృష్టి సారించిన పోలీసులు

నవతెలంగాణ-సిటీబ్యూరో
ఐబొమ్మ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు రవి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని విషయాలపై పోలీసులు కూపీలాగి పలు విషయాలు రాబట్టినట్టు తెలిసింది. పోలీసుల విచారణలో అతడు సినిమా పైరసీకి పాల్పడిన విధానాన్ని వివరించినట్టు సమాచారం. పైరసీ సినిమా వెబ్‌పోర్టల్స్‌కు సేవలు మాత్రమే అందించానని, అన్ని ఉద్యోగాల మాదిరిగానే దీన్ని ఎంపిక చేసుకున్నానని విచారణలో రవి చెప్పినట్టు తెలిసింది. ముందు తాను చేసిన ఐటీ ఉద్యోగంలో సంపాదించిన దానికింటే అధిక మొత్తంలో డబ్బులు వస్తుండటంతో పైరసీని ఎంచుకున్నానని తెలిపినట్టు సమాచారం. మూడు వేర్వేరు కేసుల్లో విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టు ఇమ్మడి రవికి 12 రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.

కోర్టు ఆదేశాల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత గురువారం చంచల్‌గూడ జైలు నుంచి రవిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ మూడ్రోజుల విచారణలో పైరసీకి సంబంధించిన కీలక వివరాలను రవి వెల్లడించినట్టు సమాచారం. టెలిగ్రామ్‌ ఛానల్‌ ద్వారా కొత్త సినిమాల పైరసీ ప్రింట్లతో వ్యాపారం చేసినట్టు ఒప్పుకున్నాడు. కేవలం సాధారణ ప్రింట్లే కాకుండా, ఏకంగా క్యూబ్‌ నెట్‌వర్క్‌ను, శాటిలైట్‌ లింక్‌ను హ్యాక్‌ చేసి సినిమాలను హెచ్‌డీ ఫార్మాట్‌లో రికార్డు చేసినట్టు తెలిపాడు. ఈ విధంగా పైరసీ చేసిన సినిమాలను అమ్మేందుకు ‘హెచ్‌డీ హబ్‌’ పేరుతో ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్‌ ఛానల్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పాడని తెలిసింది. దాంతో అధికారులు టెలీగ్రామ్‌ ఐడీలపై దృష్టి సారించారు.

పోలీసులకు చిక్కకుండా ముందుస్తుగానే జాగ్రత్తపడిన విధానాన్ని రవి చెప్పినట్టు తెలిసింది. ప్రహ్లాద్‌కుమార్‌ అనే వ్యక్తిని సృష్టించి, దానిపై పాన్‌కార్డు, వెబ్‌పోర్టల్స్‌ కొనుగోలు చేసినట్టు తెలిపినట్టు తెలిసింది. మిత్రుడు ప్రసాద్‌ డిజిటల్‌ సంతకంతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించాడని సమాచారం. పోలీసులకు చిక్కితే ఎలా బయటపడవచ్చో ముందుగానే సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకున్నాడని తెలిసింది. కరేబిన్‌ దీవుల్లోనే శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్న రవి, కూకట్‌పల్లిలోని ఇంటిని అమ్మేద్దామనుకుని రాగా.. ఆ సమయంలో పోలీసులకు చిక్కాడు. రవి నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసులు ముందుగానే ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారని తెలిసింది. ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారలతో కీలక విషయాలు రాబట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -