- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇప్పుడే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలంతా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మొదలు కానున్న బీఆర్ఎస్ ఎల్ పీ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, పార్టీలో సంస్థాగత బలోపేతంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించే అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.
- Advertisement -



