Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నిరసన

మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ నిరసన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరుతో దేశ ప్రజలకు ఉపాధి కల్పన కల్పించే పథకంలోని మహాత్మా గాంధీ పేరును మోడీ సర్కార్ తొలగించడంపై నిరసిస్తూ మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం శోచనీయమన్నారు. మహాత్మా గాంధీ పేరు ఉండటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరును యధావిధిగా అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ మహాత్మా గాంధీ పేరు పెట్టడం ఖాయమన్నారు.

మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల్లో నుంచి తొలగించలేరన్నారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం సరైనది కాదన్నారు. దేశం కోసం పోరాడుతూ స్వతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీని ఇది కించపరచడమేనని అవుతుందనాన్నరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, మద్నూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఉషా కుటుంబ సభ్యులు సంతోష్ మేస్త్రి, మద్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి గోపి, మాజీ ఎంపీటీసీ కర్రేవార్ రాములు, మాజీ ఎంపీటీసీ సంగీత కుటుంబ సభ్యులు రచ్చ కుశాల్, యువ నాయకులు అమూల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్, పెద్ద తడగూర్ సర్పంచ్ శాంతాబాయి, కుటుంబ సభ్యులు ఈరన్న, యువ నాయకులు బాలు యాదవ్, సచిన్ అశోక్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -