- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ కుటుంబాలతో కలిసి పండగ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజక వర్గ పరిధిలోని క్రిస్ మస్ వేడుకలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరవుతున్నట్లు మద్నూర్ మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలను రేపు సోమవారం బిచ్కుంద మండలం కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
- Advertisement -



