- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా మీ విజయం గొప్పదని, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు. ఆదివారం వారు ఉషా సంతోష్ మేస్త్రి మర్యాదపూర్వంకంగా కలిసి, శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎందుకంటే మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ గా ఏండ్ల తరబడి మున్నూరు కాపు వారే సర్పంచ్ గా ఎన్నిక కావడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న తరణంలో ఈసారి మీరు సర్పంచ్ గా విజయం సాధించడం గొప్ప పరిణామమని అన్నారు. ఈ సందర్బంగా సంతోష్ మేస్త్రీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మద్నూర్ యువ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -


