Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్ క్యాంపులో మేడిటేషన్ హాల్ ప్రారంభం

ఎమ్మార్ క్యాంపులో మేడిటేషన్ హాల్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఇంటర్నేషనల్ మెడిటేషన్ దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో మేడిటేషన్ హాల్ ఆదివారం  ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి కెఎస్ఎన్ మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడిటేషన్ అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య జీవన శైలి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హార్ట్ పుల్నెస్ ఫౌండేషన్ వచ్చిన లక్ష్మణ్  మైన్ మేనేజర్ శ్రీనివాస్, సర్వే డిజిఎం సర్వోత్తమ్, హెచ్ఆర్ డీజీఎం రమేష్ బాబు,ఏఎమ్మార్ ఉద్యోగులు,కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -