Monday, December 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'పతంగ్‌' ట్రైలర్‌కి అనూహ్య స్పందన

‘పతంగ్‌’ ట్రైలర్‌కి అనూహ్య స్పందన

- Advertisement -

సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’. సినిమాటిక్‌ ఎలిమెంట్స్‌, రిషన్‌ సినిమాస్‌, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రానికి విజయ్ శేఖర్‌ అన్నే, సంపత్‌ మకా, సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకుడు. ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్‌ ప్రణవ్‌ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్‌ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ‘పతంగ్‌ రోలర్‌ కోస్టర్‌లా మా సినిమా నిర్మాణం కూడా జరిగింది. పతంగ్‌ జర్నీ గ్రేట్‌ జర్నీ’ అని నిర్మాత విజయ్ శేఖర్‌ అన్నే తెలిపారు.

సురేష్‌ కొత్తింటి మాట్లాడుతూ,’యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌గా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. మరో నిర్మాత రమ్య మాట్లాడుతూ, ‘ఫెస్టివ్‌ మూడ్‌కు సెట్‌ అయ్యే సినిమా అని అందరూ అంటున్నారు. సినిమా చూసిన అందరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘కంటెంట్‌ నమ్మి నిర్మించాం. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా టఫ్‌ కాంపీటిషన్‌ ఉంది. మా సినిమా ఈ సంవత్సరం విడుదలై విజయం సాధించిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నాం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరించండి’ నిర్మాత సంపత్‌ మకా చెప్పారు. మరో నిర్మాత నాని బండ్రెడ్డి మాట్లాడుతూ,’ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు గర్వంగా ఉంది. పతంగ్‌ల పోటీతో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -