ఇటీవల ‘లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హర్రర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ఈనెల 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్, హెబ్బాపటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీవాస్ మీడియాతో ముచ్చటించారు. ‘వరుసగా రెండు బ్లాక్‌బస్టర్‌లు అందుకున్న తరువాత చేస్తున్న మూడో సినిమా ఇది. మేం ఏదీ అబ్లీగేషన్‌తో తీసుకోం. ఒకవేళ తీసుకున్నా ఇది కంటెంట్ నచ్చితేనే మాత్రమే తీసుకుంటాం. సినిమా నచ్చకపోతే వెంటనే వాళ్లకు వేరే ప్రత్యామ్నాయ మార్గం చెబుతాం. ఈసినిమా కంటెంట్ మీద నమ్మంతోనే అసోసియేట్ అయ్యాం. ఈ సినిమా బాగుంది. మొదటి పది నిమిషాల్లోనే మీకు మేము ఈ సినిమా ఎందుకు తీసుకున్నామో.. అర్థమవుతుంది.
సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తిగా, భయంగా ఉంటుంది. హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమా ఇది. చివరి 15 నిమిషాలు, సినిమా చాలా కొత్తగా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్స్‌లో ఇప్పటి వరకు మేం ఫెయిల్ కాలేదు. ఈ సినిమా విషయంలో ఫెయిల్ అవ్వం అనే నమ్మకం ఉంది. ఇది ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తప్పకుండా రీచ్ అవుతుంది. నేను, వంశీ కలిసి చేసిన ఏ సినిమా కూడా ఫెయిల్ కాదనే నమ్మకం ఉంది. ఈ సినిమాని కూడా ఫస్ట్‌కాపీ చూసి తీసుకున్నాం. తప్పకుండా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాని చూడొద్దని చెబుతున్నాం. అయితే ఇది కేవలం హర్రర్ సినిమానే కాదు అందరికి వర్కవుట్ అవుతుంది. దీనికి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. ఈ సినిమా లాస్ట్ 20 నిమిషాలు హర్రర్ సినిమాలా ఉండదు. ఓ మంచి విషయం చెప్పారని ఫీల్ అవుతారు. చాలా రియల్‌లైఫ్ ఇన్‌సిండెట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇది మన లైఫ్‌లో కూడా జరిగిందా అనే ఫీల్ కలుగుతుంది. సినిమా విడుదలకు ముందే ప్రీమియర్స్ వేస్తాం’ అని నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీవాస్ అన్నారు.
అంచనాలకు మించి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



