బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్లు
అందుబాటులో ఉంటూ…అభివృద్ధి చేస్తాం
నవతెలంగాణ – మల్హర్ రావు
సుదీర్ఘకాలం సాగిన ప్రత్యేకాధికారుల పాలనకు సోమవారంతో తెరపడింది. మండలంలో కొత్తగా ఎన్నికైన 15మంది సర్పంచ్,15 మంది ఉప సర్పంచ్లు,128 వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. 2024 ఫిబ్రవరి 2 నుంచి సుమారు 22 నెలల 20 రోజులపాటు ప్రత్యేకాధికారుల నేతృత్వంలో పంచాయతీల ఆలనా..పాలన సాగింది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించినా అన్ని గ్రామాలలో ఒకేరోజు పదవీ బాధ్యతలను అప్పగించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇన్నాళ్లూ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించిన వారి నుంచి నూతన సర్పంచ్లు పదవీ బాధ్యతలను స్వీకరించారు.ఇక ఐదేళ్లపాటు కొత్తగా ఎంపికైన సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవిలో కొనసాగనున్నారు.
అందుబాటులో ఉంటాం….అభివృద్ధిలో ముందుంటాం
సోమవారం మండలంలోని 15 గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేసిన సర్పంచ్లు,ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అభివృద్ధిలో ముందుంటాంని చెప్పారు. గ్రామాభివృద్దే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిస్కారం కోసం నిరంతరం పని చేస్తామంటూ నొక్కి చెప్పారు.



