Tuesday, December 23, 2025
E-PAPER
Homeఖమ్మంప్రమాణ స్వీకారం చేసిన సీపీఐ(ఎం) సర్పంచ్ కూరం దుర్గమ్మ

ప్రమాణ స్వీకారం చేసిన సీపీఐ(ఎం) సర్పంచ్ కూరం దుర్గమ్మ

- Advertisement -

– ఒక్కరు మినహా 26 మంది సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
– పాలక వర్గాల కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయా పార్టీల నేతలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
: రెండో సాధారణ స్థానిక ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచ్‌ లు, పాలక వర్గాల ప్రమాణ స్వీకారాలు అశ్వారావుపేట మండలంలో అంగరంగ వైభవంగా నిర్వహించ బడ్డాయి.ఆయా పంచాయితీలలో జరిగిన కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పార్టీల మండల స్థాయి నాయకులు పాల్గొని సర్పంచ్ లకు,వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

మండలంలోని 27 పంచాయితీలకు గాను 26 మంది సర్పంచ్‌ లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.అయితే వినాయకపురం సర్పంచ్ కొవ్వాసి రాజు ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడి ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి బంగారు సందీప్ మిగిలిన పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.సర్పంచ్ కొవ్వాసి రాజు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఉపసర్పంచ్ జగదీశ్వర రావు పంచాయితీ పరిపాలనను పర్యవేక్షిస్తారని తెలిపారు.

నందిపాడు పంచాయితీ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పాతల్లిగూడెం, అచ్యుతాపురం, మద్దికొండ, ఊట్లపల్లి, నారాయణపురం, గాండ్లగూడెం పంచాయితీల్లో జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు, ప్రమోద్, నండ్రు రమేష్, మోహన్ రావు పాల్గొన్నారు.

నారంవారిగూడెం, నారం వారి గూడెం కాలనీ, అనంతారం, వేదాంతపురం పంచాయితీల్లో బీఆర్ఎస్ నాయకులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, మందపాటి రాజమోహన్ రెడ్డి, వగ్గెల పూజ, సున్నం నాగమణి లు హాజరయ్యారు.

కావడి గుండ్ల పంచాయితీలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) ప్రజా పంథా నాయకులు గోకినపల్లి ప్రభాకర్, కల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పాలనను ప్రజల ఆశయాలకు అనుగుణంగా సాగించాలని నేతలు ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌ లకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -