Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్టాఫ్ నర్స్ ఫలితాలు విడుద‌ల‌

స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాసిన మొత్తం 40,423 మంది అభ్యర్థుల వివరాలను, వారు సాధించిన మార్కులతో సహా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

అభ్యర్థులు నేటి (డిసెంబర్ 24) నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బోర్డు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ‘సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను విడుదల చేస్తామని, ఆ తర్వాత మెరిట్ ఆధారంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని బోర్డు వెల్లడించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -