Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమీర్ నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

అమీర్ నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని అమీర్ నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి బుధవారం మండల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ ఊరే నీలవేణి దశరథ్, ఉపసర్పంచ్ మాలావత్ పద్మా శంకర్ లతో పాటు వార్డు సభ్యులను మండల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సభ్యులు శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పాలకవర్గం సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు గుర్రం నరేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించడం వల్లే అదే రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా ప్రజా ప్రతినిధులుగా  పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఎన్నుకోబడ్డట్టు గుర్తు చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాలేపు రాజేశ్వర్, మెరుగు నాగేశ్వర్, గుండోజి నవీన్, రాగి శ్రీశైలం, మాజీ సర్పంచ్ పుప్పాల గంగాధర్, దశరథ్, మల్లేష్, దాము, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -