Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సంపూర్ణంగా బంద్ పాటించిన వ్యాపారులు

సంపూర్ణంగా బంద్ పాటించిన వ్యాపారులు

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల నిరంకుశ వైఖరికి నిరసనగా అఖిల పక్షల ఆధ్వర్యంలో  స్థానిక తహసిల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టి  సంపూర్ణ బందు పాటించారు. ముందుగా స్థానిక తహసిల్దార్ శ్యాంసుందర్ కు పంట కొనుగోళ్లు ప్రారంభించాలని, ఎటువంటి నిబంధనలు లేకుండా యూరియాలు రైతులకు అందించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఒక్క నెల నుండి ఇచ్చోడ మార్కెట్లో రంగు మారిన సొయా, రంగు మారిన మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు నిరసన వ్యక్తం చేశారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరితో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కారణం యూరియా ఎప్పటిలాగే యూరియా పంపిణీ చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కొత్తగా ఆప్ తీసుకురావడం దానివల్ల నిరక్షరాస్యులైన రైతులకు అలాగే ఆదివాసి గిరిజన రైతులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున దానిని వెంటనే రద్దుచేసి యధావిధిగా యూరియా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే గత పది సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా రైతులు సొసైటీల ముందు గానీ ఫర్టిలైజర్ల ముందు గాని ఏనాడు కూడా లైన్లో నిలుచుని ఎరువులు, విత్తనాలు కానీ ఏరోజైనా ఇబ్బంది ఉండేనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు కష్టాలు మొదలయ్యాయని, కావున ఇప్పటికైనా మొండివైఖరి  వీడనాడి రైతులకు సకాలంలో ఎరువులు అలాగే రంగు మారిన పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరచ సాయన్న, బి ఆర్ఎస్ పార్టీ యువజన మండల అధ్యక్షులు డుబ్బుల చంద్ర శేఖర్, రైతులు చట్ల వినీల్, కొంగర్ల రాజన్న, చట్ల తరుణ్, కర్వల గంగయ్యా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -