Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీకి ద్రోహం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: మంత్రి శ్రీధర్ బాబు

పార్టీకి ద్రోహం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్ల అభినందన సభలో మంత్రి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కాటారం, మహాదేవపూర్, పలిమల, మల్హర్, మహాముత్తారం మండలాల పరిధిలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పార్టీకి నష్టం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని,పార్టీకి ద్రోహం చేస్తే కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ అంటే సిద్ధాంతం, త్యాగం, ప్రజాసేవ. ఆ విలువలను కాపాడే వారికే పార్టీలో భవిష్యత్తు ఉంటుంది” అని తేటతెల్లం చేశారు.

ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలని సూచించారు.అభివృద్ధి పనుల్లో పారదర్శకత, సమానత్వం పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని హితవు పలికారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరవేయాలని, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -