నవతెలంగాణ – జుక్కల్
బిల్లులు లేకుండా రైతులకు రసాయన ఎరువుల అమ్మితే రసాయన ఎరువుల అమ్మితే చర్యలు తప్పవు అని కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ మంగళవారం సాయంత్రం అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వజ్రఖండి, ఖండేబల్లూర్, కౌలాస్ తో పాటు పలు గ్రామాలలో ఆయిల్ ఫామ్ తోటలను పొద్దుపోయే వరకు పరిశీలించారు. ఆయిల్ ఫాం పంట పొలంలో అంతరా పంటగా వేస్తున్న ఇతర పంటలను చూసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. అంతర పంటలు వేసుకుంటున్న రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు సలహాలు ఇవ్వడం జరిగింది. రైతులు ఎప్పుడు మండల వ్యవసాయాధకారి, లేద క్లస్టర్ పరిధిలోని ఏ ఈ ఓలకు సంప్రదించి పంటలకు వ్యాపిస్తున్న చీడపురుగులు, దేవుళ్ల , వివరాల సమాచారం సేకరించాలని ఏఈవోలు చెప్పిన విధంగా తగు మోతాదులో ఎరువులను , రసాయన ఎరువులను ఉపయోగించాలని రైతులకు సూచించారు.
ఏవో మహేశ్వరి మాట్లాడుతూ రైతులు ముఖ్యంగా భూసార పరీక్షలు ప్రతి సంవత్సరం చేయించుకోవాలని అన్నారు. భూమిలో సూక్ష్మ పోషక పదార్థాలు తక్కువగా ఉండడం వలన పంటల దిగుబడి తగ్గుతుందని అందుకే భూసార పైసలు తప్పనిసరిగా చేయించుకోవాలని రైతులకు సూచించారు. రైతులు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు మెగ్గుచూపాలని అన్నారు. సేంద్రియ ఎరువుల వలన భూసారం పెరుగుతుందని , పంట దిగుబడి , నాణ్యత పెరుగుతుందని రైతులకు సూచించారు. రైతులు సూచించిన పంటల వివరాలను క్లస్టర్ పరిధిలోని ఏఈవోలకు తెలియజేయాలని వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.
పంట పండిన తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి రైతులకు సులువుగా అమ్ముకోవడానికి వీలు ఉంటుందని తెలిపారు. పంట పొలాలు పండించే రైతు పంటల వివరాలు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండవద్దని అన్నారు. ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోతే రైతులకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వెంటనే నేను తక్కువ ధరలకు దళాలకు అమ్ముకునే దుస్థితి నెలకొంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ తో పాటు మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి సంబంధిత గ్రామాల ఏఈవోలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



