నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గత కొంతకాలంగా ఎస్సీ కాలనీ తో పాటు ఇతర కాలనీలో నెలకొన్న నీటి సమస్యలను తీర్చేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బోరు తవ్వకం పనులను ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ గురువారం ప్రారంభించారు. స్థానిక కుడిగుంట్ల చేరువ వద్ద బోరు తవ్వకం పనులను చేపట్టారు. గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులను నింపేందుకు ప్రస్తుతమున్న బోరు బావులు సరిపోకపోవడంతో నూతనంగా బోరు తవ్వకం పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య తీర్చేందుకు ప్రస్తుతం వేసిన బోరు బావి దోహదపడుతుందన్నారు. పాడైన పైప్లైన్ మరమ్మత్తులను కూడా చేపట్టి గ్రామస్తుల నీటి సమస్యలను స్వాస్థ్యతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.బోరుబావి నుండి పెద్ద ఎత్తున నీరు రావడంతో ఉప సర్పంచ్ అశోక్ తో పాటు గ్రామస్తులు హర్షణ వ్యక్తం చేశారు.
బోరు తవ్వకం పనులు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



