నవతెలంగాణ – ఆలేరు
మాటూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడించడం తక్కువ విషయం కాదన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గా జన్నే సిద్ధులు గెలిపించడం ఇది మాటూరు ప్రజల విజయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనంది భాస్కర్ అంబాల శ్రీను పేర్కొన్నారు. బుధవారం నాడు మాటూరు గ్రామంలో సర్పంచ్ సిద్ధులు ఉప సర్పంచ్ గా బైరపాక రాములు వార్డు మెంబర్లు ప్రమాణస్వీకారం జరిగింది.
ఈ కార్యక్రమంలో హాజరైన మాట్లాడుతూ.. డబ్బు మందు ఇతరత్రా ప్రయత్నాలకు లొంగకుండా స్థానికంగా ఉండే ప్రజలతో నిత్య సంబంధాలు కలిగిన వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను పూలమాలలతో శాలువాలతో సన్మానించారు. వార్డ్ మెంబర్లు పిల్లల మర్రిసౌమ్య, అంబాల నరసింహులు, బండ్రు శీను, జన్నేనరేష్, రమాదేవి, ధనవంతుల లక్ష్మారెడ్డి, భైరపాక భాగ్యమ్మ, బైరపాక పరశురాములు, నరేందర్ ఎరుకల నరేష్ కొల్లూరు ఉపసర్పంచ్ గాజుల దశరథ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



