- Advertisement -
సర్పంచ్ గుగులోతు సుజాత వాసు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని సౌల తండా గ్రామపంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్మణ్ ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు సుజాత వాసు అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి గ్రామ అభివృద్ధి చేసేందుకు మమ్మల్ని సర్పంచ్ గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తానని తెలిపారు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయని గుర్తించి మొదటగా ఏది ప్రజలకు అవసరము దాన్ని పరిష్కార మార్గంగా ముందుకు సాగుదాం అని అన్నారు. అవసరమైతే ప్రభుత్వం వద్దకు వెళ్లి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
- Advertisement -



