Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ

ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ

- Advertisement -

మునిగలవీడు గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని మునిగల వీడు గ్రామంలో  గొర్రెలకు&మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ చేసినట్లు ఆ గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు తెలిపారు. బుధవారం పశువైద్యాధికారి సోమ శ్రీను ఓ ఎస్ ఓ ఐలయ్య ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గొర్రెలకు మేకలకు ఎలాంటి రకమైన జబ్బులకు దారితీస్తే మండల కేంద్రంలో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి వాటికి కావాల్సిన మందులను వాడాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మండల కార్యదర్శి కొమ్మనబోయిన వెంకన్న సభ్యులు పెద్దగోళ్ల ఉప్పలయ్య, కడబోయిన శ్రీను, కొమ్మనబోయిన శ్రీశైలం ,ముత్తయ్య, కొమరయ్య,  జక్కుల చంద్రయా, గువ్వ ఉప్పలయ్య , పాయిలి వెంకన్న, బద్దె మల్లయ్య  నాయకులు తుప్పతూరి రాజు యాదవ్ , బైస రాజేష్ , దుస్స యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -