- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాపులను క్షమించమనే త్యాగశీలత, అహింసా శాంతి మార్గాన్ని ప్రస్తావించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ మైనారిటీలకు దేశానికే ఆదర్శంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహించే సెక్యులర్ సంప్రదాయాన్ని తెచ్చామని గుర్తు చేశారు.
- Advertisement -



