Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డా.నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

డా.నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ నూకల మాట్లాడుతూ.. తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజల ద్వారా విశేష స్పందన లభించింది అన్నారు. సుమారు 80 మందికి పైగా ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్య సేవాలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో 42 వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.కె నూరుద్దీన్, కాలనీవాసులు, హాస్పిటల్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -