నాలుగేండ్ల తర్వాత ఆసీస్ తుది జట్టుకు ఎంపిక
నేటినుంచి ఇంగ్లండ్‌తో బాక్సింగ్ డే టెస్ట్
మెల్‌బోర్న్: ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభం కానుంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మూడు టెస్ట్ మ్యాచ్‌లను నెగ్గిన ఆసీస్ జట్టులో పేసర్ రిచర్డుసన్‌కు నాలుగేండ్ల తర్వాత తుదిజట్టులో చోటు లభించింది. ఇంగ్లండ్‌తో జరిగే నాల్గో టెస్ట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన 11మంది ఆటగాళ్ల జాబితాలో రిచర్డుసన్ ఒకరు. సీఏ ప్రకటించిన 12మంది ఆటగాళ్లలో నలుగురు పేసర్లకు చోటు లభించగా.. స్టీవ్ స్మిత్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
స్పిన్నర్ నాథన్ లియాన్ స్థానంలో టాడ్ మర్ఫీకి చోటు దక్కింది. రిచర్డు సన్ 2021లో చివరిసారి టెస్ట్ మ్యాచ్ ఆడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని దీర్ఘకాలం విశ్రాంతిలో ఉన్నాడు. తొలి రెండు టెస్ట్‌లు ఆడిన బ్రెండన్ డాగెట్, మైఖెల్ నెసర్‌లకు కూడా తుది 11మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ విశ్రాంతి తీసుకోవడంతో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో స్మిత్ హాజరయ్యాడు.
జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), హెడ్, వెథర్లాండ్, లబూషేన్, ఖవాజా, క్యారీ(వికెట్ కీపర్), గ్రీన్, స్టార్క్, బోలండ్, డోగెట్, నెసెర్, రిచర్డుసన్.



