బుక్‌ఫెయిర్‌లో జాన్ వెస్లీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బుక్‌ఫెయిర్‌ను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సందర్శించారు. ఈ సందర్భంగా అనిశెట్టి రజిత వేదికపై మాట్లాడుతూ బుక్ ఫెయిర్‌లో సమాజ పురోగమనానికి సంబంధించిన సాహిత్యాన్ని ఎక్కువ మంది యువత కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తకాల పఠనం అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆనందాచారి, ఆర్ శ్రీరాంనాయక్, నాయకులు కోట రమేష్, మూర్తి, మహేందర్ నవతెలంగాణ బుక్ హౌస్ సభ్యులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జాన్‌వెస్లీకి శాలువాతో సన్మానం చేసి, పుస్తకాలను బహూకరించారు.
పుస్తకం ఒక ఆయుధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



