- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్‌కు చెందిన 14 ఏండ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. క్రీడల విభాగంలో ఆయన కనబరిచిన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ వరించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ పురస్కార ప్రదానోత్సవం కారణంగా, వైభవ్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
- Advertisement -



