- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు అండగా యంటామని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ అన్నారు. మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన మంథని గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శుక్రవారం పుట్ట బాధిత కుటుంబాన్ని పరమర్షించి, ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వచ్చిన యువకుడు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి పూడ్చలేని నష్టం జరిగిందన్నారు.
- Advertisement -



