Saturday, December 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవీబీ జీ రామ్‌జీ చట్టంతో పంచాయతీల అధికారాలకు తూట్లు

వీబీ జీ రామ్‌జీ చట్టంతో పంచాయతీల అధికారాలకు తూట్లు

- Advertisement -

పని దినాల పెంపు బూటకం
పాతచట్టాన్నే కొనసాగించాలి : వెబినార్‌లో వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వీబీ జీ రామ్‌జీ చట్టంతో ఉపాధి హామీ చట్టంపై పంచాయతీలకు ఉన్న అధికారాలను రద్దు చేసిందని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. ఇక నుంచి కేంద్రం తన ఇష్టారాజ్యంగా ఉపాధి హామీపై పెత్తనం చేయనుందని వ్యాఖ్యానించారు. చట్టంతో వచ్చే హక్కులను దేశంలోని పేదలు కోల్పోయారని అభిప్రాయపడ్డారు. పని దినాలు పెంచామని చెబుతూ కేంద్రం సాధారణ కూలీలు, పేదలను మోసం చేస్తున్నదని నిరసన తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘కొత్త ఉపాధి హామీ చట్టం ఎవరికి ప్రయోజనం ?’ అంశంపై వెబినార్‌ నిర్వహించారు.

దీనికి ఎస్‌వీకే మేనేజింగ్‌ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ కొత్త చట్టంలో 100 నుంచి 125 రోజులను పనిదినాలను పెంచామని కేంద్రం చెప్పడం బూటకమని విమర్శించారు. ఉపాధి హామీ అంటే మట్టి పనులేనని చెప్పారు. ఇప్పుడు యంత్రాలతో చేయించేందుకు కొత్త చట్టంలో నిబంధనలు తెచ్చారని అన్నారు. 2005లో తెచ్చిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత చట్టంగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కు కాస్త బిక్షగా మారిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుతం 60:40 నిష్పత్తిలో ఖర్చుపెట్టేలా మార్గదర్శకాలు రూపొందించి రాష్ట్రాలపై భారం మోపిందన్నారు. ఉపాధి హామీ చట్టం మూలంగా కేంద్రం గతంలో ప్రతియేటా రూ. 85 వేల కోట్లు ఖర్చుచేసేదన్నారు.
ఇప్పుడు దేశంలోని అన్నీ రాష్ట్రాలపై రూ. 29 వేల కోట్ల భారం వేసిందని స్పష్టం చేశారు. తద్వారా తెలుగు రాష్ట్రాలపై రూ. 2900 కోట్ల భారం పడిందని వివరించారు. రైతులకు కూలీలను అందుబాటు లో ఉంచాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు .

ఉపాధి హామీపై పంచాయతీలకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని తెలియజేశారు. ఇక నుంచి ప్రతిరోజూ రెండు పూటలా హాజరువేస్తారని తెలియ జేశారు. పని దినాలు, వేతనాలను ఇక నుంచి కేంద్ర మే నిర్ణయిస్తుందన్నారు. ఇంతకుముందు పంచా యతీలు ఆ పనిచేసేవని చెప్పారు. ఇంటర్నెట్‌ ద్వారా సోషల్‌ఆడిట్‌ చేస్తామని చెబుతున్నదన్నారు. కొత్త చట్టంలో కాంట్రాక్టర్లకు, యంత్రాలకు అవకాశం కల్పించారని తెలిపారు. వికసిత భారత్‌ అంటే పేదల ను వంచించడమే అవుతుందన్నారు. పేదలకు ఖర్చు చేయాల్సిన నిధులను మిగిలించడం ద్వారా అంబానీ, అధానీలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. పనులు దొరకక గ్రామీణ పేదల ఆత్మహత్యలు పెరుగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చర్యలకు టీడీపీ, జేడీయూ మద్దతు ఇవ్వడాన్ని ఖండించారు. కేంద్ర చర్యలను నిరసిస్తూ చంద్రబాబు ఒక్క మాట మాట్లాడలేదనీ, దుర్మార్గంగా వ్యవహరిం చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కోడ్‌లను తీసుకురావడం ఇందులో భాగమేనని సరికాదని స్పష్టం చేశారు. 2005 ఉపాధి చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -