Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండూరులో  ఘనంగా మహా  పడిపూజ పూజ  

చండూరులో  ఘనంగా మహా  పడిపూజ పూజ  

- Advertisement -

– వచ్చే ఏడాదికి ఆలయం పూర్తి

– నిర్మాణ దాతలకు ఘనంగా సన్మానం 

నవతెలంగాణ- చండూరు

 స్థానిక అయ్యప్ప  స్వామి దేవాలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కలశం పూజలు నిర్వహించి, ఏకశిలా 18 పడిమెట్లపై జ్యోతులు వెలిగించారు.  గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్  డాక్టర్ కోటి శ్రీనివాసులు – అరుణ దంపతులు  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అయ్యప్ప పాటలతో దేవాలయం  మార్మోగింది. స్వాములు పెద్దసంఖ్యలో హాజరై భక్తి పాటలు ఆలపిస్తూతన్మయత్వానికిలోనయ్యారు.అయ్యప్పస్వామి నామస్మరణ, శరణుఘోషలతో  మార్మోగింది.

 అయ్యప్ప దేవాలయం పునర్మాణానికి దాతలు ముందుకు రావడం ఎ ంతో అభినందనీయమని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. పడిపూజ కా ర్యక్రమం ముందు దాతలను ఘనంగా శాల్వాలతో సత్కరించారు. ప్రధానం గా దేవాలయ పునర్నిర్మాణానికి గాంధీజీ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ కోడ్ శ్రీనివాసులు ఐదు లక్షల రూపాయలు విరాళాలు ప్రకటించారు.  మహా పడిపూజ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ కోడి శ్రీనివాసులు పడిని.. వెలిగించారు.  పడిపూజ అనంతరం విచ్చేసిన భక్తులకు పంచామృతము, అన్న ప్రసాదం  

కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప పడిపూజ దాతలు , సరికొండ వెంకన్న, పంచామృత దాతలు ముమ్మడి యాదగిరి, నడి కూడా సైదాచారి, అన్నదాత, గంగిశెట్టి మారయ్య, కుమారులు, భజన ధాత కారింగు రామ్మూర్తి, అలంకరణ దాతలు, దొటి వెంకటేష్ యాదవ్,అనంత చంద్రశేఖర్. అయ్యప్ప స్వాములకు అన్నదాత బొబ్బలి వెంకటరెడ్డి,ప్రచారణ దాతలు, కట్ట అంజయ్య బొమ్మరబోయిన వెంకటేశ్వర్లు, రామస్వామి వెంకటే శ్వర్లు, ఐతరాజు మల్లేష్, పన్నాల లింగయ్య యాదవ్, గంట విజయ్, స్టేజి దాదా దోమల శ్రీను, లు పడిపూజ దాతలుగా నిలిచారు. వారికి గురు స్వాములు ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -