Saturday, December 27, 2025
E-PAPER
Homeజాతీయంసీబీఐని న‌మ్మ‌డం ఎలా?: ఉన్నావో బాధితురాలు

సీబీఐని న‌మ్మ‌డం ఎలా?: ఉన్నావో బాధితురాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి ఉన్నావో లైంగిక‌దాడి కేసు బాధితురాలి త‌ల్లి జాతీయ మీడియాతో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సెంట్ర‌ల్ బ్యూరో ఇన్వెస్ట్ గేష‌న్ (CBI)ను న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని, సీబీఐని ఏ విధంగా న‌మ్మాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. సీబీఐ ఆధికారులు ఇంత‌వ‌ర‌కు త‌న‌ను క‌లువ‌లేద‌ని, కేసు ద‌ర్యాప్తు అధికారిని మాత్ర‌మే క‌లిశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా లైంగిక‌దాడి కేసులో కీల‌క నిందితుడు కుల్దీప్ సింగ్ సెగార్ కుమారై వ‌ద్ద‌కు వెళ్లి మాట్లాడార‌ని ఆరోపించారు. ఒకే వేళ త‌మ‌ను క‌లిసుంటే సీబీఐపై త‌మ‌కు విశ్వాసముండేంద‌న్నారు. కానీ నేటి వ‌ర‌కు కూడా సీబీఐ అధికారులు మ‌మ్మ‌ల్నీ క‌లువ‌లేద‌న్నారు.

కేసు కీల‌క స‌మ‌యంలో త‌మ లాయ‌ర్ వైపు సీబీఐ నిల‌బ‌డి ఉంటే సెగార్‌కు బెయిల్ వ‌చ్చి ఉండేది కాద‌ని ఆమె ఆరోపించారు. కేసు వాద‌న స‌మ‌యంలో ఏరోజు కూడా సీబీఐ త‌మ వైపు చూడ‌లేద‌న్నారు. త‌మ లాయ‌ర్‌కు సీబీఐ మ‌ద్ద‌తుగా నిల‌బ‌డి ఉండే సెగార్ కు బెయిల్ వ‌చ్చేది కాద‌ని వాపోయారు. ఈ రోజు ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని, కేసులో తాము గెలిచే వాళ్ల‌మ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

“వారి కుటుంబం పటాకులు కాలుస్తోంది. కానీ నా కుటుంబాన్ని అడగండి. నా తండ్రిని చంపారు. నా భర్తను, నన్ను మా ఉద్యోగాల నుండి తొలగించారు. మేము ఏమి తింటాము? మేము ఎక్కడికి వెళ్తాం? నాకు ఇద్దరు నవజాత శిశువులు ఉన్నారు. ఒక కుటుంబాన్ని బెదిరించి, మరొక వ్యక్తికి ఉచిత అనుమతి ఇవ్వడం అన్యాయం” అని ఆమె న్యాయవ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఉన్నావో లైంగిక‌దాడి కేసులో ప్ర‌ధాన నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెగార్ కు జీవిత ఖైదు ర‌ద్దుతో పాటు బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేస్తూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు మిన్నంటాయి. వెంట‌నే సెగార్‌కు బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ప‌లు మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ‌. స‌దురు నిర‌స‌న‌ల నేప‌థ్యంలో సీబీఐ సుప్రీంకోర్టులో స్పెష‌ల్ లివ్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -