Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలి 

హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలి 

- Advertisement -

విద్యార్థి సంఘాల నాయకులు 
హాస్టల్ ముందు నిరసన 
నవతెలంగాణ – భూపాలపల్లి

హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హాస్టల్లో అగంతకుడు అనే వార్త సోమవారం నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన విషయం తెలిసింది. స్పందించిన విద్యార్థి సంఘాల నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హాస్టల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలికల హాస్టల్ లోకి రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు రావడం సరికాదన్నారు. ఇందుకు సంబంధిత  వార్డెన్ బాధ్యత వహించాలన్నారు. అంతేకాకుండా గతంలో పలు సంఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, టిఆర్ఎస్వి  సంఘాల నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, నేరెళ్ల జోసెఫ్, కొల్లోజు దిలీప్, సకినాల వికాస్, శ్యామ్ రాజు, గోగుల రాజు,, భూక్య నవీన్, బందు సుజాత, బుర్ర స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి: సొతుకుకు ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు 
జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఎస్సీ హాస్టల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణమైన హాస్టల్లో  వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి.

అగంతకుడిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: కొల్లోజు దిలీప్, టిఆర్ఎస్వి జిల్లా నాయకులు
ఓ రాత్రి సమయంలో హాస్టల్ కు వచ్చిన అగుంతకుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. హాస్టల్లో జరుగుతున్న సంఘటనలపై ఆ వ్యక్తి ఎవరో  విచారణ జరిపి పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆ వార్డెన్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి.

పునరావృతం కాకుండా చూడాలి : కుమ్మరి రాజు కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
బాలికల హాస్టల్ లో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటివి పునరావతం కాకుండా చూడాలి. సంబంధిత వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి.

విద్యార్థునిల కు రక్షణ కల్పించాలి: బంధు సుజాత, యంగ్ గర్ల్స్ కన్వీనర్
జిల్లాలో హాస్టల్లో పలు భయాందోళన సంఘటనలు జరుగుతున్నాయి. హాస్టల్లో ఉండే విద్యార్థులకు రక్షణ కల్పించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -