Tuesday, December 30, 2025
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని బాటసింగారం వద్ద సర్వీస్‌ రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొట్టుకున్నాయి. ఓ బైక్‌పై ఉన్న ముగ్గురు విద్యార్థినులు కిందపడిపోయారు. అదే సమయంలో పక్క నుంచి వెళుతున్న లారీ కిందపడటంతో హంసలేఖ (22) అనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరీక్ష రాయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన విద్యార్థినిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -