ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచ్లు వార్డు సభ్యులకు సన్మానం
అభినందన సభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ
నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) బలపర్చగా గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులకు సన్మానించారు. అనంతరం జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖరీదు గా మారినా ఈ ఎన్నికలో సీపీఐ(ఎం) అభ్యర్థులగా పోరాడి విజయం సాధించారని చెప్పారు. ఎన్నికలో ఎన్ని ఒత్తడిలు వచ్చినా లొంగకుండా పార్టీ, ప్రజల పక్షాన నిలబడడం ఎంతో గొప్ప విషయం అన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు. ఎర్రజెండా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చేతన్యవంతులుగా చేయాలన్నారు. ప్రజల్లో మంచి ప్రజాప్రతినిధులుగా గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శలు ద్రవ్య రవి నాయక్, పాదూరి శశిధర్ రెడ్డి, రొండి శ్రీనివాస్, జాతంగి సైదులు, వన్ టౌన్, టూ టౌన్ కార్యదర్శలు డా.మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు, జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



