- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామంలో తన సహచరుడి కుటుంబానికి తోటి సహచరుల బృందం ఆర్థిక సహాయమందజేసినట్టు స్థానికుడు కొంకటి సురేశ్ మంగళవారం తెలిపారు. ఎండీ షాధుల్లా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడని.. విషయం తెలుసుకున్న 2009 పదవ తరగతి మిత్ర బృందం సుమారు రూ.7500 నగదును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసినట్టు సురేశ్ తెలిపారు.
- Advertisement -



