జిల్లా మానసిక వైద్యాధికారి రమణ
నవతెలంగాణ – రామారెడ్డి
విద్యార్థులు తమ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మానసికంగా దృఢంగా ఉండాలని మానసిక వైద్యాధికారి రమణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాలు, వాటితో కలిగే అనర్థాలపై, మానసిక గా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. యువత మత్తు మత్తు పదార్థాలకు బానిస కావద్దని, విలువైన జీవితాలను వృధా చేసుకోవద్దని, తమ ఇళ్లల్లో కుటుంబ సభ్యులు మద్దు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడాలని తెలిపారు.
గతంలో రామారెడ్డి మండలంలో పలు గ్రామాల్లో డ్రగ్కు బానిసైన వ్యక్తులను ఇదివరకే కౌన్సిలింగ్ అందించినట్లు తెలిపారు. కుటుంబాలను, సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని అన్నారు. మారకద్రవ్యాల నిరోధకనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వనిత, పిహెచ్సి వైద్యులు సురేష్, ఉపాధ్యాయులు పద్మ, గంగ లక్ష్మి, రజిత, అరుణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



