న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారుతున్న సమ యంలో అత్యున్నత న్యాయస్థానం దిద్దుబాటు చర్యలు చేపట్టటం మంచిదే! ఉన్నావో అత్యాచార కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెం గార్‌కు బెయిల్ ఇచ్చి ఢిల్లీ హైకోర్టు తీవ్ర తప్పిదానికి పాల్పడింది. దానిపై దేశమంతా భగ్గు మంది. ఆరావళి పర్వతాల్లో యథేచ్ఛగా మైనింగ్ చేపట్టేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు అను కూలంగా సుప్రీంకోర్టు తీర్పు నివ్వడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. వీటి పర్యవ సానంగా అత్యున్నత న్యాయస్థానం పునరాలోచన చేసినట్టు కనిపిస్తోంది.
ఉన్నావోలో 15 ఏళ్ల నిరుపేద దళిత బాలికపై 2018లో… అప్పటి బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ లైంగికదాడికి ఒడిగట్టడం, ఆమె తండ్రిని పోలీస్ కస్టడీలోనే పొట్టనపెట్టుకోవడం అత్యంత దుర్మార్గం. అత్యాచారం కేసులో జీవిత ఖైదు (మరణించే వరకూ జైలులోనే), పోలీసు కస్టడీలో బాలిక తండ్రిని హత్య చేయించిన కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. బాలిక వెళ్తున్న కారును లారీతో ఢకొీట్టించి చంపే ప్రయత్నంలో ఆమె, న్యాయవాది తీవ్రంగా గాయపడగా, బాధితురాలి ఇద్దరు అత్తలు ప్రాణాలు కోల్పోయారు. మరో కీలక సాక్షి అనుమా నాస్పదంగా మరణించాడు. జైలులో ఉండే అనేక ఘాతుకాలు చేయించిన సెంగార్‌కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శిక్షను సస్పెండ్ చేస్తున్నామని ఇచ్చిన తీర్పు ఉన్నావో బాధితురాలికే కాదు… సమా జంలో అణచివేతకు గురవుతున్న మహిళలందరికీ పెనుముప్పే! బాధితురాలు, సిబిఐ పిటిషన్లు దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ‘ఒక కానిస్టేబుల్ పబ్లిక్ సర్వెంట్ అయిన ప్పుడు శాసన సభ్యుడు ప్రజాసేవకుడు కాడా? ఎమ్మెల్యేను మినహా యించడం సరైందేనా?’ అన్న సుప్రీం ప్రశ్న అత్యంత సమంజసం. కేసుకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని నిలిపి వేస్తున్నా మన్న ప్రకటన బాధిత కుటుంబానికి ఊరట. ఇలాంటి నేరగాళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ…అందలమెక్కిస్తున్న అధికార పార్టీ కూడా దోషే!
ఆరావళి శ్రేణిలో వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న కొండలనే పర్వతాలుగా పరి గణిస్తూ కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనానికి అనుకూలంగా తానే ఇచ్చిన ఉత్తర్వులను నిలుపు చేస్తూ సుప్రీంకోర్టు పునరాలోచనలో పడింది. ఫలానా ఎత్తున్న కొండలనే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలనే నిర్వచనం అమలులోకి వస్తే తొంభైఐదు శాతం కొండలు అంతరిస్తాయని పర్యావరణవేత్తలు మొదలు సామాన్య ప్రజానీకం వరకూ రోడ్డెక్కారు. పర్వతాల ఎత్తుపై నిర్వచనం ఇవ్వడంలో సహేతుకత లోపిం చిందని, సంబంధిత కమిటీ నివేదికలో, తీర్పులో ఇలాంటి పలు సంక్లిష్టమైన, కీలక అంశాలపై దృష్టి పెట్టలేదని పేర్కొంటూ.. ఇటీవల ఇచ్చిన తీర్పును అన్వయిస్తూ ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టకూడదని సిజెఐ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ తాజాగా ఆదేశించడం తాత్కాలిక ఊరట. పర్యా వరణానికి పెట్టని కోటగా, థార్ ఎడారి విస్తరించ కుండా అడ్డుకుంటున్న కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంది. కార్పొరేట్ల అత్యాశకు వంత పాడుతున్న పాలకుల చర్యల వల్ల ఇప్పటికే అడవులు, కొండలు, పలు రకాల పక్షులు, జంతువులు అంతరించిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపి స్తోంది. కాలుష్యం దావానలంలా కమ్మే స్తోంది. ఈ పరిస్థితుల్లో దేశంలో అత్యంత పురాతనమైన పర్వతాలు, కొండలు ‘కార్పొరేట్ బకాసురుల’ చేతికి చిక్క కుండా కాపాడగలిగితేనే నేటి దిద్దుబాటుకు అర్థం ఉంటుంది.అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టిస్తూ, ఉత్తరప్రదేశ్‌లో నిరుపేద దళిత బాలిక కుటుంబంపై పగ బట్టిన ‘మనుధర్మ’ దాష్టీకానికి, కార్పొరేట్‌లకు ‘పర్వతాలను’, భవిష్యత్ తరాల ఆశలను దోచిపెట్టేందుకు సిద్ధమైన పాలకులను నిలువరించగలిగేది ప్రజాగళమే. స్వతంత్రంగా వ్యవహరించి… ప్రజల మౌలిక హక్కులను, రాజ్యాంగాన్ని, ప్రకృతిని పరిరక్షిస్తేనే అత్యున్నత న్యాయస్థానం చర్యలు అర్థవంతమౌతాయి.
దిద్దుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



