Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ నుండి పలువురి నాయకుల సస్పెన్షన్ 

బీఆర్ఎస్ నుండి పలువురి నాయకుల సస్పెన్షన్ 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైన కొరిపల్లి, చిన్నవంగర, అవుతాపురం గ్రామాలకు చెందిన పలువురు కీలక నాయకులను సస్పెన్షన్ వేటు వేశారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొరిపల్లి గ్రామానికి చెందిన ఎండీ ముజీబుద్దీన్, ఎడ్ల చిరంజీవి, ఎండీ యాకూబ్, పెరుగు యాదిరెడ్డి, పెరుగు మహిపాల్ రెడ్డి, చిన్నవంగర గ్రామానికి చెందిన కొండపల్లి విజయ్ పాల్ రెడ్డి, అవుతాపురం గ్రామానికి చెందిన కోట అశోక్, ‌‌‌‌‌‌పాకనాటి గోపాల్ రెడ్డి, కోట కుమార్, బొమ్మెరబోయిన సంతోష్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, అశోక్, కొమురయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.‌ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీరాం సుధీర్, రాంపాక నారాయణ, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -