Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు

యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు

- Advertisement -

– మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ 
నవతెలంగాణ – మెదక్-టౌన్ 
రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. జిల్లాలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ అన్నారు. అక్టోబర్ 2025 నుండి జనవరి 2026 సంవత్సరానికి మన జిల్లాకు 12,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని రాష్ట్రానికి ప్రతి పాదానాలు పంపినట్లు తెలిపారు. డిసెంబర్ 30 నాటికి మెదక్ జిల్లాకు 12663 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని పేర్కొన్నారు. 8000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు ఇప్పటి వరకు కొనుగోలు చేయడం కూడా జరిగింది. ఇంకా జిల్లాలో 4000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, జిల్లాలో మన అవసరానికి మించి యూరియా జనవరి కి కూడా రాబోతుందనీ రైతులు గమనించగలని తెలిపారు. రైతులు యూరియా దొరకదేమోనని ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -