Wednesday, December 31, 2025
E-PAPER
Homeజాతీయంఏంజల్‌ చక్మా హ‌త్య కేసు..ద‌ర్యాప్తుకు సిట్

ఏంజల్‌ చక్మా హ‌త్య కేసు..ద‌ర్యాప్తుకు సిట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో త్రిపుర కు చెందిన విద్యార్థి ఏంజల్‌ చక్మాను దుండ‌గులు హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఏంజల్‌ చక్మా హత్య కేసు దర్యాప్తు కోసం డెహ్రాడూన్‌ సీనియర్ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (SSP) అజయ్‌ సింగ్‌ సిట్‌ (Special Investigation team) ఏర్పాటు చేశారు. డెహ్రాడూన్‌ రూరల్ ఎస్పీ పంకజ్‌ గైరోలా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసు దర్యాప్తు చేస్తుందని అజయ్‌ సింగ్‌ చెప్పారు.అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యగ్యరాజ్‌ అవస్తిని అచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డు అందజేయనున్నట్లు డెహ్రాడూన్‌ పోలీస్ ప్రధాన కార్యాలయం వెల్లడించింది.

కాగా ఏంజల్‌ చక్మా అనే 24 ఏళ్ల త్రిపుర విద్యార్థి డెహ్రాడూన్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ నెల 9న కొందరు అతడిపై దాడికి పాల్పడ్డారు. చూడటానికి స్థానికుడిలా లేరనే కారణంతో అతడిపై, అతడి సోదరుడు మైఖేల్‌ చక్మాపై దాడి చేశారు.మైఖేల్ చక్మా చికిత్స పొందుతున్నాడు. కాగా ఇలాంటి జాత్యహంకార దాడులకు అడ్డుకట్ట వేయాలని, చక్మా హంతకులను ఉరితీయాలని ఈశాన్య రాష్ట్రాల సంస్థ (NESO) డిమాండ్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -