- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
72వ ఇంటర్ డిస్టిక్ ఉమెన్ కబడ్డీ పోటీలలో కేజీబీవీ విద్యార్థిని పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిందని పాఠశాల ప్రత్యేక అధికారిని భవాని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 25 నుంచి 28 తేదీ వరకు జరిగిన 72 వ ఇంటర్ డిస్టిక్ ఉమెన్ కబడ్డీ పోటీలలో కేజీబీవీ విద్యార్థిని లక్ష్మీనయన ఎంపికై పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిందని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థిని లక్ష్మీనయన కు పాఠశాల ప్రత్యేక అధికారిని భవాని, వ్యాయామ ఉపాధ్యాయులు రాధిక, ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్ కుమార్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



