– మార్కెట్ కమిటీ డైరెక్టర్ జై డి మధులత శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందేలా గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు కృషి చేయాలని కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జెడి మధులత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కోన సముందర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడ్డ పంచాయతీ పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్, ఉప సర్పంచ్ బాలే రావ్ శంకర్, వార్డు సభ్యులు సామ మనీషా, పిల్లల ప్రియాంక, కరిపే రాజశేఖర్, గట్టు లావణ్య, గాజబోయిన సుకన్య, గడ్డం బుచ్చమ్మ, పోతుగంటి నాగరాణి, చిలుక లత, చెంగల పావని, జక్కుల రూప, మేకల శ్రీనివాస్ లను మార్కెట్ కమిటీ డైరెక్టర్ జెడి మధులత శ్రీనివాస్ రెడ్డి దంపతులు సత్కరించారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులందరినీ శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని అన్నారు. గ్రామంలో నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, సిసి రోడ్ సమస్యలను పరిష్కరించేందుకు పాలకవర్గం ముందుండి పనులు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందాలన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సామ మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సందీప్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంగాల అశోక్, తిరుపతి, రాజేందర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



