టి20 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
కాబూల్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఐసిసి టి20 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. 15మంది ఆటగాళ్ల బృందానికి స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యం వహించనున్నాడు. గుల్బద్దిన్ నైబ్‌తోపాటు నవీన్ ఉల్ హక్ రీ ఎంట్రీ ఇచ్చారు. 20ఏళ్ల వికెట్ కీపర్, బ్యాటర్ మహ్మద్ ఇషాక్ కొత్తగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వేతో సిరీస్ ఆడిన షరాఫుద్దీన్ అష్రఫ్, అహ్మద్ మాలిక్, బషీర్ అహ్మద్, ఇజాజ్ అహ్మద్, అహ్మద్ జారులకు చోటు దక్కలేదు. తాజాగా ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఎక్కువమంది మ్యాచ్ విన్నర్లు ఉండడం మరో విశేషం.
నూర్ అహ్మద్, సెదిఖుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, ఇబ్రహీం జడ్రాన్ లాంటి సీనియర్ ప్లేయర్లతోపాటు పటిష్టంగా ఉంది. వీరందరికీ ఐపిఎల్‌తోపాటు భారత పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. టి20 ప్రపంచకప్ గ్రూప్-డిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా తొలి మ్యాచ్ తలపడనుంది. ఇదే గ్రూప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, కెనడా జట్లు ఉన్నాయి. టి20 ప్రపంచకప్‌కు ముందు ఆఫ్ఘన్ జట్టు జనవరి 19నుంచి యుఎఇ వేదికగా వెస్టిండీస్‌తో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
జట్టు: రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్ జాయ్, సదిఖుల్లా అటల్, ఫజల్ హక్ ఫారూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమాల్, మహ్మద్ నబీ, గుల్బద్దిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాణ్, దర్వీష్ రసూలీ, ఇబ్రహీం జడ్రాన్.
రిజర్వు ఆటగాళ్లు: అల్లా ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్,
జియా-ఉర్-రెహ్మాన్ షరీఫ్.



