Thursday, January 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువొడాఫోన్‌ - ఐడియాకు భారీ లబ్ది!

వొడాఫోన్‌ – ఐడియాకు భారీ లబ్ది!

- Advertisement -

రూ.87,695 కోట్ల బకాయిలకు మారటోరియం, వడ్డీ కూడా రద్దు
2031 నుంచి పదేండ్ల వరకు వెసులుబాటు
కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ : ప్రయివేటు రంగం టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా (విఐ)కి భారీ లబ్ధి చేకూర్చేలా మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు (ఏజీఆర్‌) సంబంధించి రూ.87,695 కోట్ల బకాయిలకు మారటోరియం కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం 2031-32 నుంచి 2041 మార్చి మధ్య చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. దీంతో ఈ మొత్తాన్ని వీఐ ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా వడ్డీని రద్దు చేసింది. దీంతో వొడాఫోన్‌ ఐడియాకు ఆర్థికంగా భారీ మద్దతును అందించినట్లయ్యింది. టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్‌ యూసేజ్‌ చార్జీలు, లైసెన్స్‌ ఫీజులకు సంబంధించి 2003-04 నుంచి 2018-19 మధ్య దాదాపు 15 ఏండ్లకు సంబంధించిన ఏజీఆర్‌ బకాయిలు పోగు పడ్డాయి.

మారటోరియం పీరియడ్‌ అంటే దాదాపు 25 ఏండ్ల వరకు బకాయిలపైనా వొడాఫోన్‌ ఐడియా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు నిలుపుదల చేసిన బకాయిలను టెలికాం విభాగం తిరిగి మదింపు చేయనుంది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఏజీఆర్‌ బకాయిలు మాత్రం 2025-26 నుంచి 2030-31 మధ్య యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. 20 కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం బకాయిల్లో కనీసం సగమైనా ప్రభుత్వం రద్దు చేస్తుందని మార్కెట్‌ బ్రోకర్లు అంచనా వేశారు. బుధవారం బీఎస్‌ఈలో వీఐ షేర్‌ విలువ 11.53 శాతం తగ్గి రూ.10.67 వద్ద ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -