- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో ఉన్న బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో గురువారం 2026 న్యూఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు తెలిపారు. విద్యార్థినిలు పాఠశాల ఆవరణలో రంగురంగు అల్లికలు వేశారు. ఒక్కరినొక్కరు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



