నవతెలంగాణ-డిచ్‌పల్లి: ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువ రైతు మృతి చెందాడు. తాండ వాసులు,ఎస్ హెచ్‌ఓ జీ.సందీప్ తెలిపిన వివరాల ప్రకారం…గండి తాండకు చెందిన బానోత్ రాజు భార్య, తండ్రితో కలిసి గురువారం ఉదయం తన వ్యవసాయ పంట పొలంలో పని చేయడానికి వెళ్లారు. పొలంలోని ఇడ్లీ వెంట గడ్డి పేరగాకుండా ఉండటానికి స్థితినే చేసి వస్తానని తమకు చెప్పాడని, దీంతో తాము ముందు ఇంటికి వెళ్లామని కుటుంబసభ్యులు చెప్పారు. తర్వాత రెండు ముడు గంటలైన రాజు ఇంటికి రాకపోవడంతో..పంట పొలానికి వెళ్లి చూడగా రాజు కుప్పకులి పోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందజేయగా ఎస్‌హెచ్‌ఓ జీ సందీప్ తాండకు చేరుకుని వివరాలు సేకరించారు. ఇదే విషయమై ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదని ఆయన చెప్పారు.మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
పాము కాటుకు రైతు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



