పది మందికిపైగా ఆస్పత్రిపాలు
నవతెలంగాణ- జగద్గిరిగుట్ట
నూతన సంవత్సరంగా జరుపుకున్న వేడుకల్లో తిన్న ఆహారం ఫుడ్ పాయిజన్ కావడంతో ఒకరు మృతి చెందగా మరో పది మందికిపైగా ఆస్పత్రి పాలైన ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని భవానీ నగర్‌లో జరిగింది. బాలానగర్ డీసీపీ కే. సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలను భవానీనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు 17 మంది కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించుకున్నారు. చికెన్, చేపలతో పాటు మద్యమూ సేవించారు. అతిగా మద్యం సేవించిన పాండు (53) తీవ్ర అస్వస్థతకు గురై అక్కడిక్కడే మృతి చెందాడు.
తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిని సుధారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించారు. మరో ఇద్దరికి కూకట్‌పల్లిలోని రాందేవ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలానగర్ ఏసీపీ పింగళి నరేష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనా స్థలంలో గడువు తీరిన పసుపు, కారం ప్యాకెట్లు లభ్యమయ్యాయని తెలిపారు. ఫుడ్ పాయిజన్‌తోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. ఈ ఘటనకు కారణం ఆహార పదార్థాలా.. లేక కల్తీ మద్యమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విందులో విషాదం.. ఒకరి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



